ఆర్యన్ ఖాన్ కు బెయిల్..? అనన్యపై పెరగనున్న ఒత్తిడి
Entertainment Timeline Tollywood

ఆర్యన్ ఖాన్ కు బెయిల్..? అనన్యపై పెరగనున్న ఒత్తిడి

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఈ నెల 30న బెయిల్ మంజూరు అయ్యే అవకాశం కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ పై 30న విచారణ చేపడతామని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఇరవై మందిని అధికారులు అరెస్ట్ చేశారు.

ఇక ఆర్యన్ స్నేహితురాలైన నటి అనన్య పాండేను ఎన్సీబీ విచారిస్తోంది. ఆమె వాట్సాప్ చాటింగ్ లు, ఫోటోలు, వాయిస్ నోట్స్ ను అనన్య పాండే చాలావరకు డిలీట్ చేసినట్లు ఎన్సీబీ గుర్తించింది. ప్రస్తుతం బ్యాకప్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోపక్క అనన్య ఈ కేసుతో తనకు సంబంధం లేదని గట్టిగానే చెపుతున్న.. చాటింగ్ డిలీట్ పై ఎన్సీబీ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్యన్ కు బెయిల్ తర్వాత, అనన్యపై అధికారులు మరింత ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది.