ఫేక్ లెటర్ తో జగన్ పై ఈనాడు విషం

ఇలాంటి అవాస్తవాలు ప్రచురించడం ఈనాడు పత్రికకు కొత్తేమి కాదు. అందులోనూ జగన్ పై కానీ జగన్ ప్రభుత్వం పై కానీ అస్సలు కొత్త కాదు. అయితే మరొక ఫేక్ న్యూస్ ఐటమ్ తో ఈ సారి కాస్త మసాలా జోడించి మన ముందుకు వచ్చారు ఈ యెల్లో మీడియా బ్యాచ్.

ఒక వైపు కరోనా కలవరం కానీ ఆంధ్ర లో మాత్రం ఏపీ ఎన్నికల కలకలం. స్థానిక ఎన్నికల వాయిదాపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు అని, ఆయనది చంద్రబాబు సామజిక వర్గం కావడం వల్లనే బాబు చెప్పినట్టు ఆడుతున్నారని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి చెప్పారు. అంతే కాకుండా ఎన్నికల అధికారి చర్యలపై సుప్రీం కోర్టు తలుపు తట్టారు జగన్.

కొందరేమో జగన్ ప్రభుత్వానికి సుప్రీమ్ మొట్టికాయలు వేసింది అని అంటే… జగన్ తెలివిగా సుప్రీం తలుపు తట్టి ఎన్నికల కోడ్ ఎత్తేసేలా చేసుకున్నాడు అను మరికొందరి వాదన. ఏది ఏమైనా అక్కడితో ఈ రచ్చ ముగుస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ యెల్లో మీడియా సరి కొత్త డ్రామా మొదలు పెట్టింది.

సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లను జత చేసుకొని, ఎల్లో పార్టీకి నేషనల్ మీడియా లో ఉన్న అనుబంధాలతో ఈ సరికొత్త ఫేక్ స్టోరీకి నాంది పలికింది.

వివరాల్లోకి వెళితే ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తనకు జగన్ ప్రభుత్వం నుండి థ్రెట్ ఉందని కేంద్ర హోమ్ శాఖకు ప్రొటెక్షన్ కోరుతూ లేఖ రాసారు అని మీడియాకి అందజేశారు. దీనిని అందరు నిజం అనుకోని నమ్మేసి కథనాలు ప్రచురించారు. ఇది ఫేక్ అని తెలుసుకున్న కొన్ని మీడియా సంస్థలు తప్పు తెలుసుకొని సవరించుకున్నాయి. అంటే కాకుండా క్షమాపణలు తెలియజేశాయి.

కానీ ఆడేది వేళ్ళకు అవసరం లేదు. దొరికిపోయాం అన్న భయం లేదు. అందుకే ఈనాడు ఇంకాస్త ముందుకు అడుగేసి ఆ లేఖ నిజమే అన్నట్టుగా తాటికాయంత అక్షరాలతో ఆ లేఖలోని ఫేక్ స్టోరీని ప్రచురించింది. కానీ తెలివిగా ఒక మూలాన ఇది నిమ్మగడ్డ ధ్రువీకరించలేదు అని వేసింది.

ఇది కొత్తేమి కాదు అనడానికి ఉదాహరణ మొన్న కియా పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. అది కూడా ఇలాగే దొరికిపోయారు కానీ అప్పటికే జరిగిపోవాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.

ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఇలాంటివారిపై , ముఖ్యం ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్న యెల్లో మీడియా పై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ప్రజల్లో ప్రభుత్వం పై అపనమ్మకం ఏర్పడుతుంది. అంటే కాకుండా అభివృద్ధి కూడా సన్నగిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Read Previous

కరోనా: ఇండియన్ ఆర్మీలో మొదటి కేసు

Read Next

సిఏఏను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం రాజ్యాంగ వ్యతిరేకం