కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులపై తీవ్ర ప్రభావం ఉంది. ఉన్నత ఉద్యోగుల నుంచి అడ్డా కూలీ వరకు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఉద్యోగులను ఇళ్లకే పరిమితం చేశారు.

ఇప్పుడు అదంతా ఎలా ఉన్నా ఎప్పుడు బిజీగా ఉండే.. నిరంతరం పని చేయాల్సిన రంగం మీడియా. అలాంటి మీడియా రంగంపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా పత్రికలకు గడ్డు కాలం వచ్చింది.

కరోనా వైరస్ వ్యాప్తి.. లాక్ డౌన్ కారణంగా ప్రింట్ మీడియా సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఎందుకంటే వాటికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వాణిజ్య ప్రకటనలు రావడం లేదు. లాక్ డౌన్ తో ఎలాంటి వ్యాపారాలు కొనసాగడం లేదు. దుకాణాలు – వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఈ సమయంలో పత్రికలకు ప్రకటనలు ఇచ్చే వారు కరువయ్యారు.  ప్రింట్ మీడియాకు ప్రధాన ఆదాయ మార్గంగా ఉన్న ప్రకటనలు ఆగిపోవడంతో ఆ సంస్థలు మనుగడ సాగించలేని పరిస్థితి.

దీనికి తోడు కరోనా భయంతో పత్రికలు కూడా వేసుకోవడానికి పాఠకులు ఆసక్తి చూపడం లేదు. ప్రచురితమైన పత్రికలను ఇంటింటికి చేరవేయడంలో కూడా హ్యాకర్లు ఆసక్తి చూపడం లేదు. బయట వాతావరణం సక్రమంగా లేదు. పైగా ప్రచురితమైన పత్రికను పాఠకులు కొనుగోలు చేయడం లేదు.

ఈ నేపథ్యంలో ముద్రణ ఖర్చును భరించలేకపోతున్నాయి పత్రికలు.

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చానళ్ళు, పత్రికలూ ఉద్యోగులను చెప్పా పెట్టకుండా జీతాలు కట్ చేసారు, కంపెనీల నుండి పంపేశారు. అందులో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉన్న నమస్తే తెలంగాణ మొదలు పచ్చ మీడియాగా చెప్పుకునే ఏబీఎన్, TV5 వరకు అందరు ఉన్నారు.

ఇక ఈ లిస్టులో ఈనాడు కూడా చేరిపోయింది ఈరోజు.

ఈనాడు లే ఆఫ్ నోటిస్

అయితే విచిత్రం ఏంటంటే ఈ నోటిస్ ఇవ్వడానికి ఈనాడు బానే కష్టపడినట్టు సమాచారం. ఉద్యోగులను ఈ సమయంలో ఉన్న పలంగా తీసేస్తే చట్ట విరుద్ధం అవుతుంది. ఉద్యోగులు గోల చేసే అవకాశం ఉంది. అందుకే చట్ట విరుద్ధం కాకుండా ఉండేలా జాగ్రత్త పది ఆచి తూచి ఈ నోటీసుని రెడీ చేసింది.

ఉద్యోగాలకు ఎసరు అంటే ఏకంగా ఉద్యోగాలు తీయట్లేదు. అలా అని జీతాలు కటింగ్ అని చెప్పట్లేదు. కాకపోతే ఎన్ని రోజులు ఉద్యోగాలు ఉంటాయో, ఎవరికి ఎంత జీతమో అనేది చెప్పలేము అంటుంది.

అంటే ఉద్యోగులను కూడా ఫ్రీలాన్స్ లేబర్స్ ని చేసి పడేసేలా ఉంది ఈ నోటీసు చుస్తే. ఇన్ని రోజులని పని అప్ప జెపుతారు. చేసిన రోజులకే జీతం ఇస్తారు. అదన్న మాట

Leave a Reply

Your email address will not be published.