ADVERTISEMENT
ADVERTISEMENT
జిల్లా బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ఆ పార్టీ జిల్లా ఆధ్యక్ష పదవికి ఆదివారం రాజీనామా చేశారు. దీంతో బీజేపీ శేణుల్లో ఆందోళన మొదలైంది. రాజీనామాకి సంబంధించి త్వరలో వివరాలను వెల్లడిస్తానని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి జిల్లా పర్యటనలో ఉండగా ఎర్ర శేఖర్ రాజీనామా ప్రకటించడం చర్చనీయాంశమైంది.
ఎర్ర శేఖర్ నిర్ణయం వెనక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జిల్లా పర్యటన కారణమన్న ప్రచారం జరుగుతోంది. రాజకీనామాకు కొద్దిసేపటి క్రితమే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో అల్పాహార విందుకు ఎర్ర శేఖర్ హాజరైనట్టుగా సమాచారం. ఆ తర్వాతే ఆయన తన రాజీనామాను ప్రకటించారు. అయితే శేఖర్ రాజీనామా వెనక గల కారణాలు తెలియాల్సి ఉంది