న్యూ ట్రాఫిక్‌ రూల్స్: నాకు కూడా ఫైన్ వేశారు: కేంద్ర రవాణాశాఖ మంత్రి

ట్రాఫిక్‌ ఉల్లంఘించిన వాహనదారులకు విధిస్తున్న భారీ జరిమానాలను కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మరోసారి సమర్థించుకున్నారు. తన వాహనానికి కూడా భారీ జరిమానా విధించారన్నారు.

ముంబైలో ఆయన సోమవారం విూడియాతో మాట్లాడారు. ఓవర్‌స్పీడ్‌గా వెళ్లినందుకు తన పేరు విూద ఉన్న వాహనానికి కూడా ఫైన్‌ వేశారని ఆయన గుర్తు చేశారు. రోడ్డు భద్రతను పెంచేందుకు జాతీయ హైవేలపై 786 బ్లాక్‌ స్పాట్‌లను గుర్తించినట్లు ఆయన తెలిపారు. సుమారు 30 శాతం డ్రైవింగ్‌ లైసెన్సులు నకిలీవి ఉన్నాయన్నారు.

భారీగా జరిమానాలు విధించడం వల్ల అవినీతి చోటుచేసుకుంటుందన్న వాదనను ఆయన ఖండించారు. అంతటా కెమెరా నిఘా పెట్టామని, మరి అలాంటప్పుడు అవినీతి ఎలా జరుగుతుందన్నారు.