బ్రేకింగ్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో TRS అభ్యర్థి కవిత ఘన విజయం
Timeline

బ్రేకింగ్ : నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో TRS అభ్యర్థి కవిత ఘన విజయం

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కవిత కల‍్వకుంట్ల ఘన విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితం వెల్లడి అయింది.14వ ఎమ్మెల్సీగా కవిత ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాసేపట్లో అధికారులు గెలుపు ధ్రువీకరణ పత్రాలు అధికారికంగా అందచేయనున్నారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నాయి.

మొత్తం 823 ఓట్లు..

  • టీఆర్ఎస్‌కు 728 ఓట్లు
  • బీజేపీకి 56 ఓట్లు
  • కాంగ్రెస్‌కు 29 ఓట్లు..
  • చెల్లని ఓట్లు 10