Breaking News :

జబర్దస్త్ ప్రోమో: బుల్లెట్ భాస్కర్ పై అప్పారావు సీరియస్.. అసలేం జరిగింది?

ఈటీవీలో ప్రతి గురువారం, శుక్రవారం వచ్చే నవ్వుల కార్యక్రమాలు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ప్రస్తుతం బుల్లి తెరపై నంబర్‌వన్ ప్రోగ్రాంగా, నవ్వులు పండించే ప్రోగ్రాంగా మంచి పేరు సంపాదించుకున్నాయి. ప్రస్తుతం ఎక్స్‌ట్రా జబర్దస్థ్ ప్రోమో చివర్లో బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో మాత్రం ఏదో తేడా జరిగింది. స్కిట్‌లో భాగంగా భాస్కర్ అప్పారావును ఒక బెత్తంతో కొట్టగా అప్పారావు ఒక్కసారిగా భాస్కర్‌పై సీరియస్ అవుతూ బండ బూతులు తిడతాడు. అంతేకాదు భాస్కర్‌పై చేయి చేసుకుని, కాలితో తంతాడు కూడా. అయితే స్కిట్లో భాగంగానే కొట్టానని భాస్కర్ అంటే ఏకంగా అప్పరావు షర్ట్ విప్పి మరీ ఆ వాతలను చూపిస్తూ ఇలానా కొట్టేది.. ఇదో స్కిట్.. అంటూ కన్నీరు పెట్టుకుని స్టేజ్‌పై నుంచి దిగిపోతాడు. అయితే ఇదంత చూసిన మనో, శేఖర్ మాస్టర్, యాంకర్ రష్మీతో సహా మిగతా టీం సభ్యులంతా ఒక్కసారిగా షాక్‌కి గురవుతారు. అయితే ఎందుకు అప్పారావు అలా సీరియస్ అయ్యాడు? ఇది నిజమేనా లేక స్కిట్‌లో భాగంగా అలా చేశాడా? అనేది తెలియాలంటే మాత్రం మార్చ్ 27 శుక్రవారం ఈటీవీలో ప్రసారం అయ్యే ఎక్స్‌ట్రా జబర్దస్థ్ ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Read Previous

ఇటలీ కరోనా కష్టాలు: సోషల్ మీడియాలో వీడియో వైరల్

Read Next

ఏపీ, తెలంగాణ ఆర్టీసీ.. మెట్రో సర్వీసులు బంద్