Breaking News :

Fact Check: మధు సూధన్ మరణం వెనక నిజాలు: భర్త చనిపోయాడని భార్యకు ముందే తెలుసా?

కరోనాతోనే వనస్థలిపురానికి చెందిన మధుసూధన్ మరణించినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.మధుసూధన్ భార్య మాధవి దాఖలు చేసిన హెబియస్ కార్ఫస్ పిటిషన్ పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. 

కరోనా కారణంగానే మధుసూధన్ మరణించాడని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హైకోర్టుకు నివేదించింది. మధుసూధన్ కు చెందిన చితాభస్మం, డెత్ సర్టిఫికెట్ కూడ ఉన్నాయని ప్రభుత్వం  తెలిపింది. 

చితాభస్మంతో పాటు డెత్ సర్టిఫికెట్ ను కుటుంబసభ్యులకు అప్పగించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను హైకోర్టు ఈ నెల 9వ తేదీకి వాయిదా వేసింది. 

గాంధీ ఆసుపత్రిలో కరోనా రోగి మధుసూధన్ మరణంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తన భర్త మధుసూదన్ ఆచూకీ తెలియడం లేదని  మధుసూధన్ భార్య మాధవి ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు గత నెల 21వ తేదీన ఫిర్యాదు చేసింది.

మధుసూదన్ మే 1వ తేదీన గాంధీ ఆసుపత్రిలో మరణించాడు. గాంధీ ఆసుపత్రి సిబ్బంది సూచన మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మధుసూధన్ అంత్యక్రియలను నిర్వహించారు.

మధుసూధన్ తండ్రి ఈశ్వరయ్య కూడ కరోనాతో మరణించాడు. మధుసూధన్ భార్య మాధవి కూడ ఇదే ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకొంది.ఆసుపత్రిలో కోలుకొంటున్న మాధవికి భర్త చనిపోయిన విషయాన్ని చెప్పలేదని మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 21వ తేదీన స్పష్టం చేశారు.

అయితే ఈ విషయమై ప్రభుత్వం చెప్పిన సమాధానంతో మాధవి తృప్తి చెందలేదు. న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించింది.ఈ మేరకు హైకోర్టును ఆశ్రయించింది. మధుసూధన్ మరణించారా లేదా అనే విషయాన్ని ఈ నెల 5వ తేదీ లోపుగా చెప్పాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీంతో ఇవాళ హైకోర్టుకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మధుసూధన్ మృతిపై నివేదికను ఇచ్చింది. ఈ నివేదికపై ఈ నెల 9వ తేదీన హైకోర్టు విచారణ చేయనుంది. 

భర్త మరణం గురించి మధుసూదన్ భార్య అయిన మాధవికి మే 1 న 7 గంటల 30 నిమిషాలకు తెలిసిందని ఆవిడే తాను NTV కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా ఒప్పుకుంది. కావాలంటే ఈ క్రింది వీడియోలో చూడండి.

సోర్స్ : NTV Telugu

అంతే కాకుండా తన భర్త మధుసూదన్ కి సంబందించి గాంధీ హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పటి నుండి చనిపోయేంత వరకు గల అన్ని బిల్స్ & సర్టిఫికెట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇంత క్లారిటీగా ఉన్నా కూడా ఆవిడ ఇలాంటి సమయంలో ఎందుకు ఇలా ప్రభుత్వ సమయాన్ని వృధా చేస్తున్నారనే వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వినబడుతుంది. దీని వెనక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది.

Read Previous

హైదరాబాద్: విమానాల్లో వలస కార్మికులను తీసుకొస్తున్న సంస్థలు

Read Next

TV5 ఇంటర్వ్యూలో బాలయ్య మళ్ళీ గెలికేసాడు…