పెరుగు సరికొత్త వాస్తవాలు.. పలు పరిశోధనల్లో వెల్లడి
Timeline

పెరుగు సరికొత్త వాస్తవాలు.. పలు పరిశోధనల్లో వెల్లడి

పెరుగు ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి, నాణ్యత ఎప్పుడు కోల్పోతుంది?

జీర్ణవ్యవస్థ సమస్య తీర్చడంలో, అమృతంలా ఉపయోగపడుతుందా?

ఆ సామర్ద్యాన్ని పెంచడంలో పెరుగు న్యాచురల్ పదార్థమా?

చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది. బరువు తగ్గాలనో, నిద్ర వస్తుందనో ఈ మధ్య చాలామంది దీన్ని తీసుకోవడం మానేస్తున్నారు.

రోజూ పెరుగు సేవిస్తే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మనం తెలుగులో దీనిని “పెరుగు” అంటాం. ఆంగ్లంలో “యోగర్ట్” అనీ హిందీలో “దహీ” అని అంటారు. పాలని పులవబెట్టడం వలన పెరుగవుతోందనేది అందరికీ తెలిసిందే. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు.

పాలలో ఉండే ప్రోటీన్స్ కంటె పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణశక్తిని అనుసరించి పనిచేస్తుంది.

నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. రోజూ 300 మిల్లీలీటర్ల పెరుగు తాగితే ఆస్టియో పోరోసిస్, క్యాన్సర్లు, ఉదర సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండొచ్చు.

నిత్యం పెరుగు తినేవాళ్లకి రక్తపోటు వచ్చే అవకాశం తక్కువ అని పలు పరిశోధనల్లో తేలింది. పెరుగు ద్వారా ఫాస్పరస్, విటమిన్-డి శరీరానికి అందుతాయి. రోజూ 300 మిల్లీలీటర్ల పెరుగు తాగితే ఆస్టియో పోరోసిస్, క్యాన్సర్లు, ఉదర సంబంధిత రోగాల బారిన పడకుండా ఉండొచ్చు.

పెరుగును కొన్ని రోజుల నిల్వ చేసి తర్వాత తినడం అంత మంచిది కాదు, అలాంటి పెరుగులో మంచి బ్యాక్టీరియా నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి, పెరుగు తినాలనుకుంటే, పెరుగు పేరబెట్టిన తర్వాత 24 గంటలలోపు తినేసేయాలి.

పెరుగు మన శరీరానికి కావల్సిన విటమిన్ కె అందివ్వడంతో పాటు, అందులో ఉండే ల్యాక్టో బాసిల్లస్ అనే బ్యాక్టీరియా శరీరంలో బి మరియు టి వంటి లింపోసైట్స్ ను (తెల్ల రక్తకణాలను) పెంచుతుంది. వాస్తవానికి రెండు కప్పుల పెరుగును నాలుగు నెలల పాటు తింటే వ్యాధినిరోధకత 5 రెట్లు పెరుగుతుంది.

సెక్స్ సామర్థ్యంను పెంచడంలో పెరుగు ఒక న్యాచురల్ పదార్థం, వాస్తవానికి వంద్యత్వాన్ని తగ్గిస్తుంది. పురుషుల్లో వీర్యం యొక్క నాణ్యత పెంచుతుంది. వీర్యం ఉత్పత్తి అయ్యేందుకు సహాయపడుతుంది.

ఇతర సౌందర్య ఉత్పత్తులు మర్చిపోండి. రోజూ పెరుగు తినడం వల్ల చౌకగా, సురక్షితంగా బ్యూటీని మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే పెరుగులో విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్, మరియు ఇతర మైక్రో మినిరల్స్ అధికంగా ఉండి చర్మం రంగును మెరుగుపరుస్తాయి. మొటిమలను మచ్చలను తొలగిస్తాయి. ఏజింగ్ లక్షణాలను నివారిస్తాయి. అంతే కాది చర్మంకు తేమను అందివ్వడంలో గ్రేట్ రెమెడీ.

పెరుగులో విటమిన్స్, మినిరల్స్, విటమిన్ బి12 , క్యాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి మైక్రోన్యూట్రీషియన్స్ ఉన్నాయి. అందువల్ల రోజు ఒక కప్పు పెరుగు తినడం వల్ల వ్యాధుల భారిన పడకుండా కాపాడుతుంది.

పెరుగులో క్యాల్షియం మరియు ఫాస్పరస్ అంశాలు అధికంగా ఉంటాయి . కాబట్టి, ఈ రెండూ కూడా ఎముకలను మరియు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి.అటువంటి సమస్యలను మీరు నివారించుకోవాలని కోరుకుంటున్నట్లైతే మీరెగ్యులర్ డైట్ లో పెరుగు చేర్చుకోవడం ఉత్తమం.

ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది . పెరుగు ఒత్తిడిని మరియు ఆందోళను తగ్గిస్తుంది . పెరుగు వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం . ఇది శరీరంలోపలకూడా చల్లని అనుభూతిని కలిగిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.