ఫేక్ న్యూస్: పార్కులో జిమ్ చేసిన దయ్యం?

ఉత్తరప్రదేశ్‌లోని ఝూన్సీ నగరంలో ఓ ఓపెన్‌ జిమ్‌లోని ఒక పరికరం దానంతటే కదులుతూ కనిపించిన వీడియో గత కొద్దిరోజులుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

భుజాల కసరత్తు కోసం ఉపయోగించే ఆ పరికరం ఎవరి ప్రమేయం లేకుండా కదలుతుండటంతో దెయ్యాలు కసరత్తులు చేస్తున్నాయని జోరుగా ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన ఝాన్సీ పోలీసులు రంగంలోకి దిగి అసలైన కారణం తెలుసుకున్నారు. 

ఇది దెయ్యాల పనికాదని, అధికంగా గ్రీజుని పోసి కొందరు ఆకతాయులు పరికరాన్ని కదిపి వీడియో చిత్రీకరించి అసత్య ప్రచారం చేశారని పోలీసు ఉన్నతాధికారి రాహుల్ శ్రీవాత్సవ్‌ తెలిపారు. పరికరంలో గ్రీజు పోసిన తర్వాత కదిపితే కొన్ని క్షణాలపాటు దానంతటే అదే కదులుతుందని పేర్కొన్నారు. దీనికి కారణమైన ఆకతాయిలను త్వరలో అదుపులోకి తీసుకుంటామని ట్వీట్‌ చేశారు.