24 గంటల తెలుగు వార్తా ఛానళ్లలో NTV కూడా ఒకటి. ఇప్పుడున్న టాప్ ఛానళ్లలో కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా వార్తా కథనాలు ప్రచురించే అతి తక్కువ ఛానళ్లలో ఇదొక్కటి. అంతే కాదు టీఆర్పీ రేటింగులు విషయం దేవుడికే తెలియాలని కానీ డిజిటల్ మీడియాలో మాత్రం తెలుగు టీవీ ఛానళ్లలో అన్నిటి కన్నా ఎక్కువ ప్రజాధారణ పొందుతున్న ఛానల్ ఇదే.
అయితే NTV ట్విట్టర్ అకౌంటుని టార్గెట్ చేస్తూ అచ్చం అలాగే కనిపించేలా ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తప్పుడు వార్తలు , సెలెబ్రిటీల మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ కొందరు వెధవలు ట్వీట్లు పెట్టడం ఆ సంస్థ దృష్టికి వెళ్ళింది. దీనితో వెంటనే అప్రమత్తమైన ఛానల్ యాజమాన్య దీనిపై వివరణ ఇస్తూ ఫేక్ అకౌంట్లను రిపోర్ట్ చేయమని కోరింది.
అంతే కాకుండా ఇలా దొంగ అకౌంట్లు క్రియేట్ చేసి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ఛానల్ పరువు కి నష్టం కలింగించే కార్యకలాపాలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయబోతున్నట్టు అతి త్వరలో ఈ అకౌంట్ల వెనక ఉన్న వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తామని ఛానల్ యాజమాన్యం తెలిపింది.
అంతే కాకుండా NTV Telugu ట్విట్టర్ అకౌంట్ అధికారికంగా వెరిఫై చేయబడిందని , దానిని గుర్తించకుండా ఫేక్ అకౌంట్లను ఫాలో అయిపోయి తప్పుడు వార్తలను నమ్మొద్దని ప్రేక్షకులకు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది .