ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు
Timeline

ప్రేమికుల రోజున నిధి అగర్వాల్ కు గుడి కట్టిన అభిమానులు

హీరో హీరోయిన్లను దేవుళ్లతో పోల్చుతూ వారిని ఆరాధించే అభిమానులు మన దక్షిణ భారత దేశంలో తప్ప ఇంకెక్కడ ఉండరు. ఇప్పటికే పలు హీరోయిన్లకు మన దక్షిణ భారతదేశంలో గుడులు కట్టిన చరిత్ర ఉంది.

అప్పట్లో సౌత్ హీరోయిన్ ఖుష్బూ కి తమిళనాడులో గుడి కట్టిన విషయం పెద్ద సంచలనమే. ఆ తర్వాత హీరోయిన్ నమిత కూడా గుడి కట్టారు తమిళ అభిమానులు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అందాల తార నిధి అగర్వాల్ కు తెలుగు తమిళ అభిమానులు కలిసి ప్రేమికుల రోజున తన విగ్రహం చేయించి గుడి కట్టారు.

అంతేకాకుండా కేక్ కటింగ్ చేసి తనకు హారతి ఇచ్చారు. పాలాభిషేకం కూడా చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి

Leave a Reply

Your email address will not be published.