కోతుల పరారుకు.. పులిలా పెయింట్ వేశాడు

12

ఓ రైతు తన పెంపుడు కుక్కని ఇలా పెద్దపులిలా తయారు చేశాడు. అయితే ఆ రైతు ఈ పని చేసింది సరదా కోసం కాదు. తన తోటను రక్షించుకోడానికి… కర్ణాటకలోని నాలూరు గ్రామానికి చెందిన శ్రీకాంత గౌడ్.. తోటలో వేసిన పంటను కోతులు రోజూ నాశనం చేస్తుండటంతో ఇలా ఆలోచన చేశారు. నాలుగేళ్ల కిందట ఓ పులి బొమ్మను తోటలో పెట్టాడు. అప్పటి నుంచి కోతులు అటువైపు రావడం మానేశాయి. దీంతో ఆశ్చర్యపోయిన శ్రీకాంత మరో తోటలో కూడా పులిబొమ్మను ఏర్పాటు చేశాడు. అది మంచి ఫలితం ఇచ్చి కోతులు రావడం మానేశాయి.

ఇక బొమ్మలు పెట్టడం ఎందుకని తన పెంపుడు కుక్కకు జుట్టుకు వేసుకుని డై కలర్‌తో పెద్ద పులి చారల్ని డిజైన్ గా వేశాడు. తన కుక్కనే పులిగా మార్చేశాడు. ఆ కుక్క తోటలో తిరుగుతుంటే కోతులు తోట వైపు తొంగి కూడా చూడటంలేదట. కెమికల్ రంగులు వేస్తే కుక్క చర్మం పాడవుతుందని హెయిర్‌ డై వేస్తున్నాడట.