రైతే నాయకుడైతే.. ఇంట్లోనే జనసేన పార్టీ కార్యాలయం

ప్రజా సేవ చేయడానికి పార్టీ ని పెట్టి, ప్రజల తరపున పోరాడుతున్న జనసేన పార్టీ కి మద్దతుగా ప్రజలే వున్నారని చెప్పాలి. మధ్య ప్రవాహం, ధన ప్రవాహం లేకుండా రాజకీయాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, ప్రజా సేవ చేస్తున్నారు జనసైనికులు. అయితే ఇపుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సొంత ఇంటిని పార్టీ కార్యాలయం గా మార్చేశాడు ఒక రైతు. అవును కాజులూరు అన్యం గోవిందు గారు, అమలాపురంలో తన సొంత ఇంటి లోనే పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్నీ జనసైనికులు సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. దీనిని పెద్ద ఎత్తులో వైరల్ చేస్తున్నారు. జనసైనికులు.

అయితే ప్రజలకు ఎంతగా నమ్మకం ఉందొ తెలిపేందుకు ఇదొక మచ్చుతునక మాత్రమే అని అభివర్ణిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించకపోయినప్పటికీ జనసైనికులు పవన్ కి అండగా వుంటున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఫై చేస్తున్న పోరాటాల్లో పవన్ అసలు వెనక్కి తగ్గడమే లేదు. విశాఖపట్టణం లో లాంగ్ మార్చ్ ని నిర్వహించి భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి రాష్ట్రానికి, ప్రభుత్వానికి తెలిసేలా చేసారు పవన్ కళ్యాణ్.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం