రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…
Timeline

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా ట్వీట్…

బీజేపీ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయని, ఆవిరి అంబానీ , అదానీ ఆస్తులు పెంచుకోడానికి ఉపయోగపడుతాయి అని , అలాంటి చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేస్తూ రైతులు దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. దాదాపు 70 రోజులకి పైగా కొనసాగుతోన్న ఈ ధర్నా జనవరి 26న ట్రాక్టర్‌ ర్యాలీతో తీవ్రరూపం దాల్చింది. దీంతో ఎలాగైనా రైతుల ధర్నా భగ్నం చేయాలని ఓవైపు ప్రభుత్వం, ఎట్టి పరిస్థితుల్లో చట్టాలను వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదంటూ రైతులు పట్టుదలతో ఉన్నారు.

మోడీ ప్రభుత్వం ఇందులో భాగంగానే రైతులు ధర్నా చేస్తున్న ఢిల్లీ బార్డర్ లో ఇంటర్నెట్ నిలిపివేశారు. ఈ వార్తను ఇంటెర్నేషనల్ పత్రిక సీఎన్ఎన్ ప్రచురించింది. దీనిని ట్విట్టర్ లో షేర్ చేస్తూ అంతర్జాతీయ పాప్‌ సింగర్‌ రిహాన్నా స్పందించారు. రైతు ఉద్యమానికి సంబంధించిన ఓ న్యూస్‌ ఆర్టికల్‌ను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘ఈ అంశంపై మనం ఎందుకు మాట్లాడట్లేదు’ అని క్యాప్షన్‌ జోడించారు.

సింగర్ రిహాన్నా చేసిన ట్వీట్‌పై బాలీవుడ్‌ నటి & బీజేపీ సపోర్టర్ కంగనా రనౌత్‌ ఆగ్రహంతో రిప్లై ఇచ్చారు. రిహాన్నా ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘ఈ సంఘటన గురించి ఎవరూ మాట్లాడరు ఎందుకంటే వారు రైతులు కాదు కాబట్టి. వారు దేశాన్ని విభజించాలని చూస్తోన్న ఉగ్రవాదులు’ అంటూ పేర్కొంది కంగనా.

రైతులను టెర్రరిస్టులు అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. ట్విట్టర్ వేంటనే తన అకౌంట్ పై యాక్షన్ తీసుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published.