లాక్‌డౌన్ సందర్భంగా వందలాది మంది సహాయంతో బాలీవుడ్ నటులు వెలుగులోకి వచ్చారురైతు ఉద్యమం గురించి సోను సూద్ వ్యాఖ్యానించారు. 23 రోజులుగా, తీవ్రమైన చలిలో, రైతులు కొత్త రైతుల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతుల దుస్థితిని చూసి తాను చాలా బాధపడ్డానని నటుడు సోను సూద్ శుక్రవారం అన్నారు.
ఈ క్రమంలో రైతుల ఆందోళనలపై రియల్ హీరో సోనూసూద్ స్పందించారు. ఇటీవల, సోనూసూద్ “వి ది ఉమెన్” అనే చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ రైతుల అంశం గురించి మాట్లాడారు. ” ఈ విషయం లో ఎవరిదీ తప్పు. ఎవరిదీ కరెక్ట్ అనే విషయమై వాదించను. కానీ రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే బాగుంటుంది. నేను పంజాబ్ లో పుట్టి పెరిగాను, రైతులతో నాకు మంచి అనుబంధం ఉంది. కానీ ఇపుడు జరుగుతున్నా పోరాటాల కారణంగా కొంతమంది రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. పొలాల్లో నాట్లు వేయాల్సిన రైతులు చలికి వణుకుతూ రోడ్లపై కూర్చుంటున్నారు. ఇంకా ఎంతకాలం రైతులు ఈ పరిస్థితుల్లో ఉంటారో తెలియడం లేదు. ఈ దృశ్యాలను ఎప్పటికి మరవలేము” అంటూ సోనూసూద్ ఆవేదన చెందారు.