రిలయన్స్ వస్తువులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న రైతులు
Timeline

రిలయన్స్ వస్తువులు బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్న రైతులు

మోడీ ప్రభుత్వ సవరణ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వారు పట్టుబడుతున్నారు. అప్పటివరకు తమ నిరసన కొనసాగుతుందని వారు అంటున్నారు. అంతే కాకుండా ఈ చట్టాలు కేవలం కార్పొరేట్ కంపెనీలు అయిన రిలయన్స్ , ఆదానీలకు మేలు చేయదలికే తప్ప రైతుల కోసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు.

రిలయన్స్ జియో సిమ్ కార్డుల దగ్గరనుండి రిలయన్స్ వస్తువులు మరియు అదానీ కంపెనీకి సంబందించిన అన్నిటిని బహిష్కరించాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా డిసెంబర్ 12 వరకు జైపూర్ హైవే బ్లాక్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. రైతుల కొత్త స్లోగన్ కూడా ” Sarkaar ki Asli Majboori – Adani, Ambani, Jamakhori’ అంటూ వారు ప్రభుత్వాన్ని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published.