కోడి కత్తికి బలైపోయిన పోలీస్ అధికారి
Timeline

కోడి కత్తికి బలైపోయిన పోలీస్ అధికారి

ఫిలిప్పీన్స్ దేశంలోనూ కోడిపందేలు జోరుగా నిర్వహిస్తారు.అయితే తాజాగా ఫిలిప్పీన్స్ లో నిర్వహించిన కోడిపందేలలో ఓ పోలీసు అధికారి దురదృష్టవశాత్తు కోడిపుంజు కత్తికి ప్రాణాలు వదిలాడు. ఎక్కడైనా కోడి పందేలు ఆడుతున్నారు అంటే అక్కడికి పోలీసులు వెళ్లి దాన్ని ఆపేస్తుంటారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. దీనితో ఫిలిప్పీన్స్ లో కోడిపందేలపై నిషేధం విధించారు. పూర్తీ వివరాలోకి వెళ్తే కోడిపందాలు అంటే సంక్రాంతి పండుగ..భారతదేశంలోని ఏపీ రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు గుర్తుకొస్తాయి.

కానీ కేవలం గోదావరి జిల్లాల్లోనే కాదు ఫిలిప్పీన్స్ దేశంలో కూడా కోడిపందాలు జోరుగానే జరుగుతాయి.కాగా కరోనా వైరస్ కారణంగా ఫిలిప్పీన్స్ లో కోడిపందాలపై నిషేధం విధించారు. కానీ అదేమీ లెక్క చేయకుండా ఫిలిప్పీన్స్ లోని ఉత్తర సమర్ ప్రాంతంలో స్థానికులతో పాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాలవారు జోరుగా కోడిపందాలు ఆడుతున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న స్థానిక శాన్ జోస్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ ఇన్ చార్జిగా పనిచేస్తున్న క్రిస్టియన్ బోలోక్ తన సిబ్బందితో కోడిపందాలు జరిగే ప్రాతానికి వెళ్లారు. అనంతరం పందాలు నిర్వహిస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పందేలు నిర్వహిస్తరనేదారికి ఆధారంగా రెండు కోడిపుంజులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కోడిపుంజులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసు అధికారి బోలోక్ ఆ కోడిపుంజులలో ఒకదానిని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో ఆకోడిపుంజు కాలికి కట్టి ఉన్న పదునైన కత్తి ఆ పోలీసు అధికారి ఎడమ తొడభాగం సర్రున కోసుకుపోయింది. దీంతో తొడలోని రక్తనాళాన్ని సర్రున కోసేసింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో తీవ్ర రక్తస్త్రావం కావడంతో పోలీసు అధికారి బోలోక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ అధికారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.