తన శాఖ అధికారులతో ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమీక్ష

8

ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తన్నీరు హరీశ్‌రావు ఎంసీహెచ్చార్డీలో మంగళవారం తన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థికశాఖలో ఏ విభాగాల పనితీరు ఎలా ఉంటుందనే విషయాలను తెలుసుకున్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై కూడా ఆయన సమీక్ష జరిపారు. రాష్ట్ర ఆర్థిక సలహాదారు జీఆర్.రెడ్డి, ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు బడ్జెట్‌లో విశేషాలను మంత్రి హరీశ్‌కు వివరించారు.

రాష్ట్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి శివశంకర్, అదనపు కార్యదర్శులు రాయిరవి, రామ్మోహన్‌రావు, వర్క్స్ అకౌంట్ డైరెక్టర్ శర్మ, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రమణారావు, పేఅండ్‌అకౌంట్స్ ఆఫీసర్ హనుమంతు, ట్రెజరీస్ డైరెక్టర్ మూర్తి, స్టేట్ ఆడిట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.