జీఎస్టీ, జీడీపీలపై నిర్మలా సీతారామన్ తాజా స్పందన
Timeline

జీఎస్టీ, జీడీపీలపై నిర్మలా సీతారామన్ తాజా స్పందన

నరేంద్ర మోడీ వంద రోజుల పాలనపై నిర్మలా సీతారామన్ చెన్నైలో మీడియాతో మాట్లాడారు. ఆటో ఇండస్ట్రీ తీవ్ర మాంద్యంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆటో ఇండస్ట్రీపై ఇండస్ట్రీ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటామని నిర్మల చెప్పారు.

ఇటీవల క్వార్టర్ 1లో జీడీపీ రేటు 5 శాతానికి పడిపోయిన విషయం తెలిసిందే. దీనిపై నిర్మలా సీతారామన్ స్పందించారు. వృద్ధి ప్రక్రియలో భాగంగానే జీడీపీ తగ్గుదలను చూడాలని అభిప్రాయపడ్డారు. జీడీపీ ఎలా ఉందనే అంశాన్ని పక్కన పెడితే, వచ్చే క్వార్టర్‌లో జీడీపీని ఎలా పెంపొందించాలనే అంశంపై దృష్టి సారించామన్నారు. సాధ్యమైనంత వరకు ఇన్ఫ్రా ఖర్చులను ఫ్రంట్ లోడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఆటో పరిశ్రమను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆటో రంగాన్ని గాడిన పెట్టాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఆటో ఇండస్ట్రీకి జీఎస్టీని తగ్గిస్తారా అని ప్రశ్నించగా.. ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సెల్ తేలుస్తుందని చెప్పారు. జీఎస్టీ రెవెన్యూ తగ్గుదలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published.