కేంద్ర మాజీమంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్ మరణించారు. దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆయనను వెంటిలేటర్​పై ఉంచి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. 

కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికావడంతో ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో ఇటీవల చేరారు. ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే ఆర్జేడీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దాదాపు 32సంవత్సరాలు పార్టీలో కొనసాగిన ఆయన, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌కు రాజీనామా లేఖను పంపారు.