యువతకు ఉచిత శిక్షణ

10

హైదరాబాద్: గ్రేటర్‌ పరిధిలోని నిరుద్యోగ యువతకు టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి నిరంజన్ తెలిపారు. కంప్యూటర్ బేసిక్స్, ఐటీస్కిల్స్, ఎంఎస్‌ ఆఫీస్ 2010, అడ్వాన్స్‌డు ఎంఎస్ ఎక్సెల్, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్‌ప్లేస్ రెడీనెస్, ఆన్‌జాబ్ ట్రైనింగ్ వంటి కోర్పుల్లో ఉచిత శిక్షణనిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పాస్ లేదా ఫెయిల్, 18 నుంచి 27 ఏండ్లలోపు వయసున్న వారు అర్హులని తెలిపారు. వివరాలకు 9515665095, 9100330378 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.