అసలు నిజం: భర్త మిస్సింగ్ అంటూ కేటీఆర్ కి ట్వీట్, స్పందించిన గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్

కరోనా: కేటీఆర్ గారు గాంధీ హాస్పిటల్ లో నా భర్త మిస్సింగ్..

వనస్థలిపురం కరోనా రోగి అంత్యక్రియల వివాదం..తన అనుమతి లేకుండా భర్త అంత్యక్రియలు నిర్వహించారని గాంధీఆస్పత్రి, జీహెచ్‌ఎంసీపై వనస్థలిపురం మాధవి అనే మహిళ ఆరోపణ.

తన భర్త మృతిపై పొంతనలేని సమాధానాలు చెప్పారంటూ ఆగ్రహం..విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేసిన మాధవి..ఘటనపై స్పందించిన గాంధీ సూపరింటెండెంట్‌.

ఆస్పత్రిలో చేరిన 23 గంటల్లోనే వ్యక్తి చనిపోయాడు..కుటుంబసభ్యులకు చెప్పే మృతదేహాన్ని పోలీసులకు ఇచ్చాం..కుటుంబసభ్యుల సంతకాలు కూడా మా రికార్డులో ఉన్నాయి : గాంధీ సూపరింటెండెంట్

మధుసూదన్‌ చనిపోయినప్పుడు కుటుంబసభ్యులంతా కోవిడ్‌ ఆస్పత్రిలో చేరారు..ప్రోటోకాల్‌ ప్రకారం మృతదేహాన్ని పోలీసులకు అప్పగించాం..ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ వాళ్లు అంత్యక్రియలు నిర్వహించారు: గాంధీ సూపరింటెండెంట్‌

ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవ్వడంతో , ఆమె ఆరోపణలలో నిజం లేదని తేలడంతో ఆ ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతానికి రెస్ట్రిక్టు చేయబడింది