జయలలిత బయోపిక్ పోస్టర్ రిలీజ్

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జయలలిత మరణం తర్వాత ఆవిడ జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ ను రూపొందించడానికి పలువురు దర్శక నిర్మాతలు రంగంలోకి దిగారు.

ఈ నేపథ్యంలో జయలలిత జీవితచరిత్రను ‘క్వీన్’ టైటిల్ తో వెబ్ సిరీస్ గా అందించడానికి దర్శకుడు గౌతమ్ మీనన్ తొలి ప్రయత్నం చేశాడు. ఆల్రెడీ ఈ వెబ్ సిరీస్ షూటింగు మొదలైపోయింది. ఈ వెబ్ సిరీస్ లో జయలలితగా రమ్యకృష్ణ నటిస్తోంది.

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి రమ్యకృష్ణ ఫస్టులుక్ ను విడుదల చేశారు. జయలలితగా ఆమె ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నట్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు.