Breaking News :

శ్రీముఖి పై కేసు, క్లారిటీ ఇచ్చిన జెమినీ టీవీ

ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖికి అనుకోని షాక్ త‌గిలింది. బంజారా హిల్స్ పోలీస్‌స్టేష‌న్‌లో శ్రీముఖిపై వెంక‌ట ర‌మ‌ణ శర్మ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశారు. జెమినీ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే జూల‌క‌ట‌క అనే కార్య‌క్ర‌మంలో బ్రాహ్మ‌ణులను కించ‌ప‌రిచే విధంగా వ్యాఖ్య‌లు చేశార‌ని శ‌ర్మ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. యాంక‌ర్ శ్రీముఖితో పాటు స‌ద‌రు టీవీ యాజ‌మాన్యంపై శ‌ర్మ ఫిర్యాదు చేశారు.

అయితే ఈ వివాదం పై జెమినీ టీవీ క్లారిటీ ఇచ్చింది. కావాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని , అనుకోని తప్పిదం వాళ్ళ జరిగిన పొరపాటు అని తెలిపింది. అంటే కాకుండా ఈ షో ఇప్పటిది కాదని 2017 లో జరిగిన కార్యక్రమంలో క్లిప్పింగ్ అది కూడా ఆ షో ఆ సంవత్సరమే క్లోజ్ చేసేశామని ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. జరిగిన తప్పిదానికి క్షమాపణలు కూడా తెలిపింది. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని సదరు ఛానల్ హామీ ఇచ్చింది.

Read Previous

బిగ్ బ్రేకింగ్: కెసిఆర్ గ్రీన్ సిగ్నల్ , రేపటి నుండి తెలంగాణలో వైన్ షాప్స్ ఓపెన్? రేట్లు పెరుగుతాయా?

Read Next

బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు : కెసిఆర్