కమల్ హాసన్ పార్టీ ముఖ్య నేత బీజేపీలోకి జంప్

నటుడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ నాయకత్వం వహించిన మక్కల్ నీది మయామ్ ప్రధాన కార్యదర్శి, పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరైన ఎ అరుణాచలం శుక్రవారం కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సమక్షంలో బిజెపిలో చేరారు. 2018 లో స్థాపించబడినప్పటి నుండి పార్టీతో సంబంధం ఉన్న అరుణాచలం, రైతులకి మేలు చేసే కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా నిలబడటానికి పార్టీ చీఫ్ హాసన్ నిరాకరించడంతో తాను ఎంఎన్ఎమ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, ఈ చట్టాల యొక్క ప్రయోజనాలను తాను అర్థం చేసుకున్నాను అన ఆయన అన్నారు. ‘సెంట్రిస్ట్’ పార్టీ అని చెప్పుకున్నప్పటికీ, MNM చీఫ్ చట్టాలకు మద్దతు ఇవ్వడానికి అంగీకరించలేదు అని, ఈ చట్టాలను బిజెపి కోణంలో చూడనవసరం లేదని అరుణాచలం మీడియాతో అన్నారు