వీడియో : గెట్ వెల్ సూన్ అంటూ అదరగొడుతున్న ‘రాజావారు రాణిగారు’

8

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ‘ రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాజావారు రాణిగారు’ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యింది. 

రాజా వారి రాణి గారు చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

అయితే ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని పాటలు, టీజర్లు ఇంటర్నెట్ లో క్రేజును సంపాదించుకున్నాయి. ఇప్పుడు ఈ చిత్రంలోని గెట్ వెల్ సూన్ అనే వీడియో సాంగ్ ని కూడా యూట్యూబ్ లో రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ వీడియో చాల విచిత్రంగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు లో రానటువంటి కొత్త రకమైన కాన్సెప్ట్ తో చిత్రీకరణ ఉందని అనిపిస్తుంది. సినిమా కూడా ఇలాగే ఉంటె హిట్టు అవ్వడం ఖాయం.