నేడు వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ‘VT10’ ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసి వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. మెగా ప్రిన్స్ బాక్సర్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ”గని” అని టైటిల్ ని ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో బాక్సింగ్ రింగ్ లో దిగిన బాక్సర్ గా వరుణ్ తేజ్ ని చూపించారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గతంలో బాలు సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు ‘గని’ని ఖరారు చేశారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఈ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
