జనసేనతో పొత్తు లేదు: క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్
Timeline

జనసేనతో పొత్తు లేదు: క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

GHMC Elections : జి ఎచ్ ఎం సీ ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించారు కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజునే జనసేనతో పొత్తు ఉండబోదని బండి సంజయ్ ప్రకటించడం. మరో వైపు జనసేన పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధం కావడంతో అభిమానుల్లో బీజేపీ పై ఆగ్రహం పెరిగిపోయింది . జనసేనను గెలిపించాలని ఆదేశంతో బీజేపీ ఐ కూడా ట్రోల్ చేస్తూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున కామెంట్లు పెట్టారు.

అంతే కాకుండా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మొన్నటి దుబ్బాక గెలుపు తలకెక్కిందంటూ విమర్శలు చేసారు. దీనితో ఒక్కసారిగా బీజేపీ శ్రేణుల్లో భయం మొదలైన్నట్టుంది. ఈరోజు జనసేన పార్టీ కూడా పొత్తు గురించి మరొకసారి ఆలోచించాలి అంటూ ఏకంగా పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది.

అయితే దీనిని ఖండిస్తూ బండి సంజయ్ క్లారిటీ ఇచ్చేసారు. పొత్తు ఉండబోదని తెలిపారు. జనసేన బీజేపీ విడి విడిగా పోటీ చేస్తాయని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ని ఈరోజు కలవనున్నట్టు చెప్పారు. అంటే కాకుండా ఇప్పటికే మా అభ్యర్థుల జాబితా విడుదల చేసాం అని , పొత్తు ప్రతిపాదనకు ఆలోచన కూడా లేదని వివరించారు.

తాజా సమాచారం :

జనసేన మీడియాకి నోటీసు రిలీజ్ చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది .పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఏ బీజేపీ నాయకులూ వెళ్లట్లేదని , ఆ వార్తలో నిజం లేదని తెలిపారు ఆ పార్టీ ప్రతినిధి రాకేష్ రెడ్డి