బ్రేకింగ్ : వరద సహాయం నిలిపి వేయండి – కెసిఆర్ ప్రభుత్వానికి ఈసీ ఆర్డర్
Timeline

బ్రేకింగ్ : వరద సహాయం నిలిపి వేయండి – కెసిఆర్ ప్రభుత్వానికి ఈసీ ఆర్డర్

ఎన్నికల నేపథ్యంలో వరద సాయం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు

పలు రాజకీయ పార్టీల నుండి మాకు ఫిర్యాదులు అందాయి… అందుకునే మేము ఈ నిర్ణయం తీసుకున్నాము.

వరద సాయం ఇప్పుడు అప్లేయ్ చేసుకున్న వారికి ఇస్తున్నారు.కాబట్టి ఎలక్షన్ ల తరువాత వరద సాయం ఇవ్వండి.

హైదరాబాద్భా నగరంలో ఎన్నడూ పాదనటువంటి భారీ వరదల కారణంగా ఎంతో మంది నష్టపోయారు. వారందరికీ అండగా తెలంగాణ ప్రభుత్వం వరద సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే . ఇంతలో GHMC ఎన్నికల షెడ్యూల్ రావడంతో వరద సాయం నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలో వరదసాయం కోసం దరఖాస్తుల స్వీకరణ, పంపిణీని నిలిపివేయాలని ఎస్ ఈసీ సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరవాత పథకాన్ని యధావిధిగా కొనసాగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్వర్వుల్లో పేర్కొంది.

వరద సాయంపై పలు రాజకీయ పార్టీల నుంచి అనేక ఫిర్యాదులు అందాయని వరద సాయం చేయడం వల్ల ఓటర్లను ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆయా పార్టీ నేతలు చెప్పడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.