అభిమానులకు షాక్.. పొత్తు లేదు – జనసేన పోటీలో లేదు – బీజేపీలో నిశ్శబ్ద విలీనమా?
Timeline

అభిమానులకు షాక్.. పొత్తు లేదు – జనసేన పోటీలో లేదు – బీజేపీలో నిశ్శబ్ద విలీనమా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం జనసేన బీజేపీ మధ్య పొత్తు గురించి గత రెండు రోజులుగా అభిమానుల్లో , పార్టీ కార్యకర్తల్లో ఏర్పడ్డ అయోమయాన్ని తొలగించడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కలిశారు బీజేపీ నేతలు. అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ .

ఏపీ, తెలంగాణలో భాజపాతో కలిసి పనిచేస్తున్నాం . ప్రధాని నాయకత్వంలో హైదరాబాద్‌ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్‌లో బలమైన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉంది. దానికోసం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపా గెలవాల్సిన అవసరం ఉంది అని తెలిపారు పవన్‌ కల్యాణ్‌. ఒక్క ఓటు కూడా బయటకు వెళ్లకుండా చూసుకోవాలి అని, జీహెచ్‌ఎంసీతో పాటు భవిష్యత్తు ఎన్నికల్లోనూ ఇరుపార్టీలు కలిసి వెళ్తాయి ఐ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

కొసమెరుపు:

మొత్తానికి పొత్తు ఉండబోదని ముందే పవన్ కళ్యాణ్ కి తెలుసా ? తెలిసే అభిమానులను అయోమయంలో పడేసి చివరికి ఇలా ఫినిషింగ్ టచ్ ఇచ్చారా ? జనసేన పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల గుండెల్లో పవన్ కళ్యాణ్ మాటలు మంటలు రేపాయి.ఎంతో కసితో ఉన్న అభిమానులకు ఆయన తీసుకున్న నిర్ణయం మింగుడుపడలేదు. పొత్తు లేకపోయినా, తమ పార్టీ కోసం అయినా పని చేయమని చెప్పాల్సింది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.