స్పెషల్ స్టోరీ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో మేయర్‌ సతీమణి
Timeline

స్పెషల్ స్టోరీ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో మేయర్‌ సతీమణి

GHMC Elections : జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన క్షణం నుండి హైదరాబాద్ రాజకీయం వేడి వేడిగా ఉంది. మొన్న దుబ్బాక గెలుపుతో బీజేపీ అధికార పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేసి ఈ ఎన్నికల్ల జెండా పాఠాలని చూస్తుంది. మరో వైపు తెరాస కు అనుకూలంగా ఉన్న వరద సహాయం పంపిణీ కూడా ఇపుడు కోడ్ అఫ్ కండక్ట్ కారణంగా నిలిపి వేశారు.

మరో వైపు నేతలు జంప్ అవుతున్నారు. ఈరోజు మాజీ మేయర్ బాండ కార్తీక రెడ్డి బీజేపీ లో చేరిన విషయం తెలిసిందే. పార్టీలన్నీ తమ అభ్యర్థులను సిద్ధం చేసుకోడానికి అష్ట కష్టాలు పడుతుంది. ఎందుకంటె ఎన్నికలకు టైం లేదు . కానీ అధికార పార్టీ మాత్రం ముందే లిస్ట్ రెడీ చేసుకుందని టాక్.

తెలుగు సర్కిల్స్ కి అందిన సమాచారం ప్రకారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి బొంతు శ్రీదేవియాదవ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో దిగనున్నారు. ప్రస్తుతం రామ్మోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న చర్లపల్లి డివిజన్‌ నుంచి ఆమె పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. మంగళవారం టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావును బొంతు రామ్మోహన్‌ దంపతులు కలిశారు. శ్రీదేవి జన్మదినం సందర్భంగా కేటీఆర్‌ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 15 రోజులుగా రామ్మోహన్‌తోపాటు శ్రీదేవి చర్లపల్లిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరద సాయం అందని బాధిత కుటుంబాలకు ఆసరాగా నిలిచే ప్రయత్నం చేశారు.

పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేసినా, అందరూ ఐక్యంగా పని చేయాలని సమావేశంలో తీర్మానించారు. గత ఐదేళ్లలో డివిజన్‌లో రూ.160 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని సమావేశంలో ప్రస్తావించారు. గ్రేటర్‌ మేయర్‌ స్థానం మహిళా జనరల్‌గా రిజర్వ్‌ కావడంతో ప్రస్తుత ప్రథమ పౌరుడి సతీమణి శ్రీదేవి కార్పొరేటర్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె పోటీపై కీలక నేతల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయని చెబుతున్నారు. అధికారికంగా పేరును ప్రకటించాల్సి ఉంది. రేపు శ్రీదేవి నామినేషన్‌ దాఖలు చేసే అవకాశమున్నట్టు సమాచారం.