కేటీఆర్.. ఇది సిరిసిల్ల కాదు భాగ్యనగరం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
Timeline

కేటీఆర్.. ఇది సిరిసిల్ల కాదు భాగ్యనగరం: ఎమ్మెల్యే రఘునందన్ రావు

కేంద్రం ఏమిచ్చింది.. ఏమిచ్చింది.. అని అడుగుతున్నావ్.. భాగ్యనగరానికి నువ్వు కానీ, కార్పొరేటర్ కానీ చేసింది ఏంది..? నువ్వేమన్న సిరిసిల్ల నుంచి తెచ్చి ఇస్తున్నవా కేటీఆర్ అంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. అభివృద్ధి అంటే కార్పొరేటర్లు కబ్జాలు చేయడమా అని ప్రశ్నించారు. మీ నాయనా చింతమడకకి లక్ష 50 వేలు ఇస్తే, కేంద్రం 8 లక్షలు ఇస్తుందన్నారు.  భాగ్యనగర్ లో రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి డబ్బులు కేంద్రం ఇచ్చిందన్నారు.

చర్యకి ప్రతి చర్య అలానే ఉంటుంది.. మీరు ఒకటి అంటే రెండు అంటాం.. ఎనకటికి ఒకాయన గిట్లే పోయారు పావురాల గుట్టలా.. దారుసలాం పర్మిషన్ తీసుకొని భాగ్యలక్ష్మి గుడికి పోవలా..? సెక్రటేరియట్ లో నువ్వు కూలగొట్టిన నల్లపోచమ్మ గుడికి రమ్మంటావా..? ఏ గుడికి రమ్మంటావు చెప్పు..? అంటూ ఎమ్మెల్యే రఘునందన్ మండిపడ్డారు. 

సెల్ఫ్ డిక్లేర్డ్ సీఎం కి సెక్యూలర్ అనే పదానికి అర్థం తెలుసా.. మిస్టర్ కేటీఆర్ ఇది సిరిసిల్ల కాదు భాగ్యనగరం.. కబ్జాలు చేయడం అభివృద్దా, అరచకమా.. ని అంత గొప్పగా హైదరాబాద్ ని నాశనం చేయడం బీజేపీ నుండి కాదు, మీ నాయనా ఫార్మ్ హౌస్ నుండి, నీ జనవడా ఫార్మ్ హౌస్ నుండి ,ని చెల్లె బతుకమ్మ ద్వారా వచ్చిన డబ్బులు, ని బావ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ నుండి తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధికి పెట్టావా.. అంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. 

మీ కార్పొరేటర్ ఇంటికి ఇంటి పన్ను 101 రూపాయి.. ఇది అరాచకమా.. అభివృద్ధి హా.. భైంసా అరాచకానికి బాద్యులు నీవా, ని నాయనా, ని బావ న, ని చెల్లెనా.. యుద్ధం యాడ చేస్తావ్.. చార్మినార్ దగ్గర చేస్తావా..  జంతర్ మంతర్ దగ్గర చేస్తావా.. రా సాయంత్రం ఫార్మ్ హౌస్ లో గ్లాస్ ల గలగల అనిపించడం యుద్ధం అనుకుంటున్నావా.. అని రఘునందన్ ఆరోపించారు. బండి సంజయ్ అనని మాటలు అన్నాడని దుష్ప్రచారం చేస్తున్నారు.. గ్రేటర్ ఎన్నికలను హిందూ, ముస్లిం యుద్ధంగా మార్చొద్దని కేటీఆర్ కి చెబుతున్న.. టీఆర్ఎస్ వచ్చాకే హైదరాబాద్‌లో అరాచకాలు పెరిగాయని ఆరోపించారు. హిందుగాళ్ళు.. బొందుగాళ్లు అన్నందుకు కరీంనగర్ ప్రజలు సమాధానం చెప్పారన్నారంటూ ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

Leave a Reply

Your email address will not be published.