జగన్ సమస్య… కేసీఆర్ కి పనికొచ్చిందా ?
Timeline

జగన్ సమస్య… కేసీఆర్ కి పనికొచ్చిందా ?

ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు మానిటర్ చేస్తున్న కేసీఆర్ కి ఈ కొత్త ఐడియా వచ్చిందా అని చాలా మందికి అనుమానం వస్తుంది. అదేంటంటే ఇప్పటికే GHMC ఎన్నికల షెడ్యూల్ వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలలో కేసీఆర్ బలం ఎంతో తేలిపోతుందని, కెసిఆర్ ప్రభుత్వం పై వ్యతిరేకత కూడా బట్టబయలు అవుతుందనేది ప్రతి పక్షాలు చెప్తున్న మాట. మొన్న దుబ్బాక లో గెలుపు బీజేపీకి చాలా కిక్కు ఇచ్చింది. ఎంత కిక్కు ఇచ్చిందంటే , దోస్తీ పార్టీ జనసేన ను కూడా పక్కకు నెట్టేసే అంత కిక్కిచ్చింది.

అయితే తెరాస నేతల్లో మాత్రం చాలానే టెన్షన్ ఉందనేది పార్టీ వర్గాల నుండి ఉన్న సమాచారం. ఈ లెక్కతో మంత్రులందరికీ చెక్ పెట్టేలా ఉన్నారు కేసీఆర్. అందుకే ప్రతి మంత్రిని ఒక్కో డివిజన్ కు ఇంచార్జి గా నియమించారట. అయితే దుబ్బాక ఓటమి హైదరాబాద్ ప్రజల్లో కేసీఆర్ ప్రభుత్వం పై ఏమైనా ప్రభావం చూపబోతుందా అనేది ఆ పార్టీ నేతలు కూడా చర్చించుకున్నారు. అందుకే ఏ హైదరాబాద్ వరదలను అడ్డం పెట్టుకొని ప్రభుత్వానికి సంబంధం లేకున్నా సరే ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని బద్నామ్ చేసిన ప్రతి పక్షాలను, వాటినే అస్త్రం గా వాడి చెక్ పెట్టె ఆలోచన చేసారు కేసీఆర్.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏ సంక్షేమ పథకం రూపొందించిన , వాటిని అమలు చేసే సమయానికి ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం పార్టీ కోర్టుకు వెళ్లడం జగన్ ప్లాన్స్ ని తిప్పి కొట్టడం జరుగుతుంది గత సంవత్సర కాలంగా. అయితే ప్రజల్లో మాత్రం జగన్ కి క్రేజ్ తగ్గట్లేదు . ప్రతిపక్ష పార్టీ వేసే ఎత్తులకు ప్రజల్లో ఆ పార్టీ విశ్వాసం కోల్పోతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. పథకాల అమలు జరిగినా జగన్ కె లాభం, జరగకుండా చూసినా ప్రతిపక్ష పార్టీని దొంగల చూపించి జగన్ ప్రజల్లో స్థానం దక్కించుకుంటున్నారనేది వారి వాదన. ఇపుడు కేసీఆర్ కూడా అదే అస్త్రం వాడబోతున్నారా జి.ఎచ్.ఎమ్.సి ఎన్నికల్లో అనిపిస్తుంది.

హైదరాబాద్ వరద బాధితులకు సహాయం చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రతి పక్షాలను అవే వరద సహాయం పేరుతొ ప్రజల్లో దెబ్బ కొట్టేలా ప్లాన్ చేస్తున్నారా కేసీఆర్ అనేలా ఉన్నాయి ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే . వరద బాధితులకు సహాయం కోసం మీ సేవ కేంద్రాలకు భారీగా తరలి వెళ్లిన హైదరాబాద్ వాసులకు ఒక్కసారిగా ఎన్నికల కమీషన్ ఝలక్ ఇచ్చింది. ప్రతిపక్షాల పార్టీ నుండి వచ్చిన కంప్లయింట్ల కారణంగా ఎన్నికలు అయ్యే వరకు ఈ సహాయం చేయడానికి ప్రభుత్వం వేచి చూడాలి అని చెప్తుంది. దీనితో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కేసీఆర్ కి కూడా కావాల్సింది ఇదే. మొదట కాస్త కేసీఆర్ పై విమర్శలు వచ్చినా , ఎన్నికలు దగ్గరయ్యే సమయానికి ప్రతిపక్ష పార్టీలే దీనికి కారణం అనే విషయాన్ని ప్రజలు గుర్తిస్తారని , ఆ దిశగా నేతలు వ్యూహాలు రచించాలని కేసీఆర్ ఆలోచన. ఈ రకంగా బీజేపీ కి దెబ్బ పడుతుందనేది వారి అంచనా.

ఇప్పటికే కేసీఆర్ కూడా బీజేపీ ని విమర్శిస్తూ కామెంట్లు చేసారని మీడియాలో వచ్చేసింది. ఇక నేతలు కూడా ఈరోజు నుండి అదే పనిలో ఉంటారు. దీనిని బీజేపీ ఎలా తిప్పి కొడుతుందనేది చూడాలి. మరి ఈ వ్యూహం ఎంతవరకు తెరాస పార్టీకి కలిసొస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *