బ్రేకింగ్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే లెక్కింపు … ఎస్ఈసి ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్ట్
Timeline

బ్రేకింగ్: స్వస్తిక్ గుర్తు ఉంటేనే లెక్కింపు … ఎస్ఈసి ఉత్తర్వులను తోసిపుచ్చిన హైకోర్ట్

డిసెంబర్ 1 వ తేదీన జీహెచ్ఎంసి కి ఎన్నికలు జరిగాయి. 18 సంవత్సరాల తరువాత గ్రేటర్ కు బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలో ఓటు వేసేందుకు స్వస్తిక్ మార్క్ ను వినియోగిస్తారు. అయితే, ఎస్ఈసి గత రాత్రి కొత్త సర్క్యులర్ ను రిలీజ్ చేసింది.

అభ్యర్థి గుర్తుపై పెన్నుతో గీసినా ఓటు వేసినట్లేనని కొత్త సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఈ సర్క్యులర్ పై బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీనిపై బీజేపీ న్యాయపోరాటం చేసేందుకు సిద్ధం అయ్యింది. ఎస్ఈసి నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది.

ఈ రోజు బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్ట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చారు. ఓట్లపై స్వస్తిక్ గుర్తు ఉంటేనే పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.