GHMC Elections: 90కి పైగా సీట్లు టి.ఆర్.ఎస్ వే
Timeline

GHMC Elections: 90కి పైగా సీట్లు టి.ఆర్.ఎస్ వే

మంగళవారం జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికలకు సంబంధించి కొన్ని మీడియా హౌసులతో పాటు ఇంటెలిజెన్స్ సర్వేల ప్రకారం కారు జోరు బాగానే ఉన్నట్లు సమాచారం. సర్వేలో అధికార టీఆర్ఎస్ ఖాతాలో సుమారుగా 90 ప్లస్ డివిజన్లు పడనున్నట్లు తెలిసిందని సమాచారం. ఇక ఎంఐఎంకు కాస్త అటు ఇటుగా ఓ 30 డివిజన్లలో గెలుపు ఖాయమని తేలిందట. ప్రచారంలో గ్రేటర్ మొత్తం మీద రచ్చ రచ్చ చేసేసిన బీజేపీ సుమారుగా 20 డివిజన్లలో గెలవబోతోందని సమాచారం అందిందట. కాంగ్రెస్, టీడీపీ తదితరులు మిగిలిన సీట్లను పంచుకోబోతున్నారట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కారు పార్టీ విషయంలో డివిజన్లలో మార్పులున్నా సంఖ్యరీత్యా పెద్దగా మార్పులున్నట్లు కనబడటం లేదు. పోయిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో గెలిచిన విషయం తెలిసిందే. అలాగే బీజేపీ 4 డివిజన్లలో మాత్రమే గెలిచింది. ఎంఐఎ మాత్రం 40 డివిజన్లలో పట్టు నిలుపుకుంది. రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ తో పోల్చుకుంటే ఎంఐఎం బలంలో మార్పు కనిపిస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎందుకంటే మతం కోణంలో ఎంఐఎం సీట్లకు కమలంపార్టీ ద్వారా బాగానే గండిపడేట్లు సమాచారం. పీవి నరసింహారావు, ఎన్టీయార్ సమాధులను కూల్చేస్తామన్న అక్బరుద్దీన్ ఓవైసి ప్రకటన బాగా డ్యామేజ్ జరగబోతోందని అనుమానంగా ఉంది. అలాగే బీజేపీ ప్రచారం ప్రభావం కూడా ఎంఐఎంపై ఎక్కువగా చూపే అవకాశం ఉందంటున్నారు.

బీజేపీ విషయానికి వస్తే పోయిన ఎన్నికల్లో గెలిచిన 4 డివిజన్ల నుండి రేపటి పోలింగ్ తర్వాత సుమారుగా 15 డివిజన్లలో గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో అర్ధమవుతోంది. సరే కమలనాదులు మేయర్ పీఠం తమదే అని ఎన్నిసార్లు చెప్పుకున్నా ఎవరు నమ్మటం లేదు. ఎందుకంటే మేయర్ కుర్చీలో కూర్చునేందుకు టీఆర్ఎస్ కే ఎక్కువ అవకాశాలున్నాయని అందరికీ తెలిసిందే. డివిజన్లలో గెలుపుతో పాటు ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్సీల రూపంలో ఎక్స్ అఫీషియో ఓట్లున్నాయని అందరికీ తెలుసు. వీటి ఆధారంగా మళ్ళీ టీఆర్ఎస్ కే మేయర్ కుర్చీ దక్కుతుందని అందరు ఫిక్సయిపోయారు.

కాకపోతే 4 నుండి 15 దాకా డివిజన్లలో గెలవటం అన్నది బీజేపీకి పెద్ద విజయం క్రిందే లెక్కనుకోవాలి. ఇదంతా దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన ఊపు ప్రభావం అన్నది స్పష్టంగా తెలిసిపోతోంది. టీఆర్ఎస్ కు మైనస్ పాయింటున్నా గ్రేటర్ ఎన్నికల్లో గెలిచినా ప్రభుత్వాన్ని కాదని బీజేపీ చేయగలిగేది ఏమీ లేదన్న పాయింట్ ఒక్కటే అధికారపార్టీకి బాగా ప్లస్ అవుతోందని సమాచారం. ఇప్పటికైతే సర్వేలో ఓటరు మూడ్ ఈ విధంగా ఉంది. మరి పోలింగ్ స్టేషన్లలోకి అడుగుపెట్టే సమయానికి మూడ్ ఎలాగుంటుందో ఎవరు చెప్పలేరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *