జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ తొలి గెలుపు

ఎల్బీనగర్: హయత్ నగర్ డివిజన్లో బిజెపి అభ్యర్థి నవ జీవన్ రెడ్డి గెలుపొందారు. నవ జీవన్ రెడ్డి చేతిలో సామ తిరుమలరెడ్డి అనూహ్యంగా ఓటమి చెందారు.

ఈ సందర్భంగా గెలుపొందిన కార్పొరేటర్ అభ్యర్థి నవ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఓట్లేసి గెలిపించిన హయత్ నగర్ డివిజన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హయత్ నగర్ డివిజన్ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పారు