బ్రేకింగ్: కారు జోరు.. బీజేపీ కి చెమటలు పెట్టిస్తున్న తెరాస
Timeline

బ్రేకింగ్: కారు జోరు.. బీజేపీ కి చెమటలు పెట్టిస్తున్న తెరాస

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో ముందుగా పిలవబడిన పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో బిజెపి విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మాత్రం మొదటి రౌండ్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక డివిజన్లలో ముందంజలో ఉంది.

దాదాపుగా 40 కి పైగా డివిజన్లలో తెరాస ముందంజలో ఉండగా కేవలం 12 నుంచి 15 డివిజన్ లో మాత్రమే బిజెపి ముందంజలో ఉంది. ఇక ఎంఐఎం కూడా ఐదు నుంచి ఆరు స్థానాల్లో ముందంజలో ఉంది.

పోస్టల్ బ్యాలెట్ లో ఎన్నికల ఫలితాలు వెలువడిన సమయంలో బిజెపి ముందంజలో ఉండటంతో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా తారుమారయ్యాయి అంటూ బీజేపీ అనుబంధ మీడియా సంస్థలు ప్రచారం చేసాయి కానీ బ్యాలెట్ ఎన్నికల ఓట్లు లెక్కింపులో తెరాస అత్యధిక డివిజన్లలో ముందంజలో ఉండటం తో బిజెపి కాస్త నిరాశ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published.