వామ్మో భగ్గుమన్న బంగారం, వెండి ధర … ఒకేరోజు 3 వేలు పెరిగింది
Timeline

వామ్మో భగ్గుమన్న బంగారం, వెండి ధర … ఒకేరోజు 3 వేలు పెరిగింది

వామ్మో ఒక్కసారిగా బంగారం ధరలు ఆకాశానికి తాకాయి. గత వారం రోజులుగా రోజు రోజు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఉన్నట్టుండి డిసెంబర్ 8 మంగళవారం రోజున 10 గ్రాములకు 816 రూపాయలు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే 10 గ్రాముల బంగారం 49 వేల నాలుగు వందల ముప్పై రూపాయల ధర పలుకుతుందట.

అటు వెండి కూడా బంగారం బాటలోనే భగ్గుమంది. కొనుగోలు పెరగడంతో వెండి ధర ఒక్కరోజే ఏకంగా 3 వేల 63 పెరిగింది. దీంతో కిలో వెండి ధర 64 వేల 361 రూపాయలకు పెరిగింది. ఇదంతా పెళ్లిళ్ల సీజన్ కావడం వల్లే అంటున్నారు విశ్లేషకులు. ఒకవైపేమో కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, మరో వైపు రైతులు ధర్నా చేస్తున్నారు. అయినా బంగారం ధర పెరగడం మాత్రం విచిత్రంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.