అమ్మో కరోనా, వామ్మో బంగారం

కరోనా వైరస్ ప్రభావంతో ఇన్ని రోజులు తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్ళీ పెరగడం మొదలయింది. నిదానంగా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బుధవారం బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు 360 రూపాయల పెరిగి 40,070 రూపాయలుగా నిలిచింది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే… పది గ్రాములకు 320 రూపాయ వరకు పెరిగింది. దీనితో 43,620 చేరుకుంది.

వైజాగ్, విజయవాడ విషయానికి వస్తే 22 క్యారెట్లు పది గ్రాములకు 360 రూపాయల పెరిగి… 40,070 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 320 రూపాయలు పెరిగింది. దీనితో 43,620 రూపాయల వరకు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో… 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 310 రూపాయలు పెరగడంతో… 42,060 రూపాయల వరకు చేరుకుంది.

అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయల పెరగడంతో… 40,860 రూపాయలకు చేరుకుంది. వెండి ధరల విషయానికి వస్తే… కేజీ వెండి ధర దాదాపు వెయ్యి రూపాయలకు పెరిగింది. 41,020 రూపాయల వద్దకు చేరుకుంది. ప్రస్తుతం డిమాండ్ లేకపోయినా సరే బంగారం ధరలు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

Read Previous

కరోనా: మా ఇంటికి రావొద్దు, గేట్ కి స్టిక్కర్లు

Read Next

నెలకి రెండు సార్లు జీతాలు ఇవ్వండి: అంబానీ ఆర్డర్