కీన్ : గూగుల్ యొక్క సరికొత్త సర్వీస్
Timeline

కీన్ : గూగుల్ యొక్క సరికొత్త సర్వీస్

keen by google

గూగుల్ సైలెంట్ గా కీన్ అనే కంటెంట్ డిస్కవరీ సేవను లాంచ్ చేసింది . కీన్‌ను పింట్రెస్టు కి పోటీగా రంగంలోకి దించింది గూగుల్ అని సమాచారం.

కీన్ అనేది మెషీన్ లార్కింగ్ ఆధారంగా పని చేస్తుంది. ఇది వెబ్ యూజర్లకు సంబంధిత వెబ్ పేజీలను ఫాస్ట్ గా రికమెండ్ చేస్తుంది. కీన్ రిఫెరల్ ట్రాఫిక్ గా వెబ్ సైట్ పబ్లిషర్లకు ఉపయోగపడుతుందని టెక్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

కీన్ అనేది గూగుల్ యొక్క ఏరియా 120 ప్రాజెక్టులలో భాగమైన ప్రయోగాత్మక వెబ్ మరియు ఆండ్రాయిడ్ యాప్. వినూత్న ప్రాజెక్టులకు ప్రాణం పోసేందుకు చిన్న జట్లు చిన్న స్టార్టప్ మోడ్‌లో కలిసి పనిచేసే దానినే ఏరియా 120 గా గూగుల్ నామకరణం చేసింది.

కీన్ లో మీకు నచ్చిన వెబ్ పేజీలను యాడ్ చేసుకోవచ్చు, దానికి సంబందించిన మిగిలిన వెబ్ పేజీలను కూడా త్వరగా వెతకవచ్చు అది ఇచ్చే రికమెండ్ ఫలితాల ద్వారా.

క్యూరేటెడ్ కంటెంట్‌ను ప్రజలతో, నిర్దిష్ట వ్యక్తులతో పంచుకోవచ్చు లేదా ప్రైవేట్‌గా ఉంచవచ్చు.

పింట్రెస్టు కి కీన్ కి తేడా ఏంటంటే కీన్ గూగుల్ సెర్చ్ ఇంజన్లను, మెషీన్ లెర్నింగ్ ని వాడుకొని యూజర్లకు ఫలితాలను అందిస్తుంది.

మీ సేకరణ పెరిగేకొద్దీ వినియోగదారులు ఆసక్తి చూపే రకమైన కంటెంట్‌ను కనబర్చడంలో కీన్ మరింత మెరుగ్గా పనిచేస్తుంది.

ఇది ప్రోయాక్టివ్ కంటెంట్ డిస్కవరీ పద్ధతి.

అధికారిక ప్రకటన ప్రకారం మీరు:

“లింక్‌లు, టెక్స్ట్, చిత్రాలు మరియు వెబ్ శోధనలను సేవ్ చేయండి మరియు జోడించండి. మీరు జోడించిన ప్రతిదీ అన్వేషించడానికి మీకు మరింత ఉపయోగపడుతుంది ”

యూజర్లు ఎంత ఎక్కువ అన్వేషిస్తే వెబ్ వ్యవస్థకు అంత ఎక్కువ ట్రాఫిక్ లభించడంలో సహాయపడుతుంది

వెబ్ సైట్లు ఎక్కువ పాపులారిటీ & ట్రాఫిక్ పొందటానికి కీన్ సరికొత్త మార్గం కానుంది. ఒక వెబ్సైటు ఎక్కువ రికమండేషన్ పొందేది ఒకరి నుండి మరొకరు షేర్ చేసుకోవడమే

అంతే కాకుండా గూగుల్ సెర్చ్ ఇంజిన్ కి వెళ్లి కంటెంట్ వెతుక్కోవడం కన్నా కూడా కీన్ ఆ ప్రాసెస్ ని మరింత సులభం చేస్తుంది

కెఎన్ యొక్క మెషిన్ లెర్నింగ్ సిస్టం యూజర్లకు కావాల్సిన కంటెంట్ ని వెతికి పెట్టడం లో చురుకుగా పనిచేస్తుంది సమయాన్ని ఆదా చేస్తుంది

సెర్చ్ ఇంజిన్ అనేది పాసివ్ మెథడ్ లో పని చేస్తుంది అంటే సెర్చ్ ఇంజిన్ అనేది యూజర్ ఏం అడుగుతాడు అని వెయిట్ చేసి అడిగినాడు రిజల్ట్ ఇస్తుంది కానీ కీన్ అలా కాదు యూజర్ ఇష్టపడే టాపిక్స్ ని ముందే యాడ్ చేసిన కంటెంట్ ద్వారా రికమెండ్ చేసి రిజల్ట్ ఇస్తుంది. దీనిని ప్రోయాక్టివ్ మెథడ్ అంటారు

Leave a Reply

Your email address will not be published.