ADVERTISEMENT
ADVERTISEMENT
పేద రోగులకు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేందుకు పంపిణీ చేసిన రూ.లక్షల విలువైన ఔషధాలు పాడుబడ్డ బావిలో కనిపించడం తెలంగాణ లోని గజ్వేల్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు సిబ్బంది కాటన్ల కొద్దీ మాత్రలు, ఇంజక్షన్లను ఓ కారులో తీసుకొచ్చి ప్రభుత్వ పాత ఆసుపత్రి ఆవరణలో ఉన్న పాడుబడిన బావిలో సోమవారం మధ్యాహ్నం పడేశారు.
గమనించిన స్థానికులు కొందరు వాటిని పరిశీలించగా అందులో చాలా ఔషధాలు 2021 అక్టోబరు వరకు వినియోగించుకోడానికి అవకాశం ఉన్నట్లు గుర్తించారు. పేద రోగులకు ఉచితంగా అందజేయాల్సిన మందులను ఇలా పడేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.