గుంటూరు: చాపల వేటకు తీసుకెళ్లి భార్యను నరికి చంపాడు

గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యని నమ్మకంగా తీసుకెళ్లి తల నరికి చంపాడో కసాయి భర్త. తల, మొండెం వేరు చేసి పడేసిన భయానక ఘటన కలకలం రేపింది. రేపల్లె సమీపంలోని సముద్ర తీరం మడ అడవుల్లో ఈ దారుణ ఘటన జరిగింది. నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు, మరియమ్మ(40) దంపతులు. చేపల వేటకెళ్లి జీవనం సాగిస్తున్నారు.ఇద్దరూ కలిసి గొంది సముద్రం సమీపంలోని ఓ రేవులో చేపల వేటకు బోటులో వెళ్లారు. మడ అటవీ ప్రాంతంలో భర్త భార్యను కిరాతకంగా చంపి తల, మొండెం వేరు చేసి రేవులో పడేశాడు.

తండ్రి ఒక్కడే తిరిగి ఇంటికి రావటంతో అనుమానం వచ్చిన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు చేపల వేటకు వెళ్లిన ప్రదేశాన్ని పరిశీలించగా మృతదేహం లభ్యమైంది. తల, మొండేన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.