#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’
Timeline

#HBDBrahmanandam: బ్రహ్మకూ సాధ్యం కానీ ‘బ్రహ్మానందం’

బ్రహ్మానందం.. మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ ప్రేక్షకులను హాస్య సాగరంలో ఓలలాడించిన హాస్య నట చక్రవర్తి ఆయన. తెరమీద కనిపిస్తే ప్రేక్షకులకు కడుపు చెక్కలవ్వాల్సిందే. చాలామంది కమెడియన్స్ .. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, విలన్లుగానూ మారారు. కానీ అలా మారతానన్నా వీలు లేని కమెడియన్ ఒక్క బ్రహ్మానందమే. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ని ఆపలేకపోవచ్చు.. కానీ బ్రహ్మీని అడ్డు పెట్టుకుని సినిమాలు నిలుపుకోవచ్చు. హీరోతో పనిలేకుండానే ఇరగదీసేయొచ్చు. కమర్షియల్ డైరెక్టర్ రాఘవేంద్రరావైనా.. కామెడీ డైరెక్టర్ ఇవివి అయినా.. ఎవరైనా సరే బ్రహ్మానందాన్ని నమ్ముకుని, సరైన పాత్ర రాసుకుంటే చాలు.. హీరోలతో పనిలేకుండానే సక్సెస్ అయిపోతారంతే. తక్కువ టైమ్ లో ఎక్కువ సినిమాలు చేశాడనీ గిన్నిస్ బుక్ లో ఎక్కించారు. లక్షలాది నవ్వులు పంచి ప్రజలకు డాక్టర్ ఫీజ్ తగ్గించాడని డాక్టరేట్ ఇచ్చారు. తెలుగు సినిమా సరస్సులో నవ్వుల పద్మమై వికసించాడనీ పద్మశ్రీ ఇచ్చారు. కానీ, బ్రహ్మానందం తర్వాత మళ్లీ బ్రహ్మానందాన్ని ఇవ్వడం మాత్రం అసాధ్యం. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మానందాన్ని మళ్లీ సృష్టించాలంటే ఆ బ్రహ్మకూ సాధ్యం కాదు కాబట్టి. వెయ్యికి పైగా సినిమాల్లో ఇన్నేసి నవ్వుల్ని పంచే యోగాన్ని సొంతం చేసుకున్న బ్రహ్మానందం జన్మ నిజంగా ధన్యం. ఈ ఫిబ్రవరి 1తో 65 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు బ్రహ్మానందం.

https://youtu.be/CJ-aOXDYGx8

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *