హ్యాపీ బర్త్ డే కరోనా
Timeline

హ్యాపీ బర్త్ డే కరోనా

ఒక్కసారిగా కరోనా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. కరోనా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అమెరికా లాంటి అగ్ర రాజ్యం కూడా కుప్ప కూలింది. కరోనా కేసులను తగ్గించే దిశగా ఏ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోయాయి. దానికి కారణాలు ఎన్ని ఉన్నా కరోనా మాత్రం విజృభించడం ఇంకా ఆగలేదు . ఇప్పటికీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు తీసుకునే చర్యలు కాస్త కరోనా కేసులకు విరామం మాత్రమే ఇవ్వగలిగాయి కానీ పూర్తిగా కోలుకోలేదు.

అయితే కరోనా బర్త్ డే ఈరోజు. ఇన్ని రోజులు మనకు మాత్రమే బర్త్ డే లు ఉండేవి కానీ మొట్ట మొదటిసారిగా ఒక వైరస్ కి కూడా బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటాం అని ఎవరు అనుకోని ఉండరు. కాస్త విచిత్రంగా వింతగా ఉన్నా ఇది నిజం. కరోనా వైరస్ పుట్టి ఈరోజుకు 1 సంవత్సరం. అంటే కరోనా మొట్ట మొదటి కేసు 2019 లో నవంబర్ 17 న నమోదు అయినట్టు చైనా పత్రికలూ కథనాలు ప్రచురించాయి .

అందుకే ఈరోజుకు సరిగా సంవత్సరం అయినందున సోషల్ మీడియాలో అందరు కరోనా కి బర్త్ డే విషెస్ చెప్తూ కామెంట్లు పెడుతున్నారు.