తెలంగాణ బడ్జెట్ 2019: నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్ రావు
Timeline

తెలంగాణ బడ్జెట్ 2019: నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను శాసనమండలిలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు సోమవారం నాడు ఉదయం 11:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో తెలంగాణ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.రూ. 1,82,000 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆ సమయంలో తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ కాలపరిమితి ఈ నెల 30వ తేదీతో ముగియనుంది.

ఈ కారణంగానే 2019-20 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. సుమారు 1.63 వేల కోట్ల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించినట్టు సమాచారం. ఆదివారం నాడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం కొత్త బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

దేశంలో ఆర్ధిక మాంద్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో వాస్తవిక థృక్పథంతో బడ్జెట్ ను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఆర్ధిక శాఖ సమీక్ష సమావేశంలో కోరారు.ఆర్ధిక మాంద్యం ప్రభావం తెలంగాణపై కూడ ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన రెవిన్యూ పడిపోయే అవకాశం ఉందని ఆర్ధిక శాఖాధికారులు అంచనా వేస్తున్నారు.

గత బడ్జెట్ తో పోలిస్తే బడ్జెట్ లో నిధుల కేటాయింపులో కోతలు తప్పకపోవచ్చని సమాచారం. మరో వైపు సంక్షేమ రంగాలపై కేసీఆర్ సర్కార్ బడ్జెట్ లో ఎక్కువ నిధులను కేటాయించే అవకాశం లేకపోలేదు.

ఆర్ధిక మాంద్యం దృష్ట్యా పొదుపు చర్యలు పాటించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు, మంత్రివర్గ సహచరులకు సూచించారు. మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని సర్కార్ పొదుపు మంత్రాన్ని పాటిస్తోంది.

Leave a Reply

Your email address will not be published.