మరో రెండు రోజుల్లో దుబ్బాక ఎన్నికల కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేసుకున్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఒక్కో పార్టీ ఒక్కో రకంగా ప్రయత్నాలు చేస్తారు. ఇందులో మద్యం , డబ్బు మేజర్ రోల్ అని అందరికీ తెలిసిన విషయ. ఇప్పటికే పలు చోట్ల అన్నే పార్టీలకు చెందిన చాల మంది నేతల ఇండ్లల్లో పోలీసులు , ఎన్నికల అధికారి పర్యవేక్షణలో సోదాలు చేసైనా వార్తలు చూస్తున్నాం. ఈరోజు కూడా హైదరాబాద్ లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు.

దుబ్బాక ఎలక్షన్ కు తరలి వెళ్తున్న డబ్బును  పట్టుకున్న టాస్క్ ఫోర్స్  పోలీసులు. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాల్లో కోటి పై చిలుకు నగదు అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. దుబ్బాక లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేసారు పొలిసు అధికారులు