మల్లెపూలు అలంకరణకు మాత్రమే.. ఆరోగ్యానికి పరమ ఔషధం

8

మల్లెపూలు కేవలం అలంకరణ నిమిత్తం, మగువలు తలలో పెట్టుకోవడానికి మాత్రమే వాడతారు అనుకోకండి.. ఈ పూలలో కూడా కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని అంటున్నారు కొందరు వైద్యులు. ఆ విషయాలు మీకోసం..!

*కళ్లు బాగా అలసటగా ఉన్నప్పుడు.. మల్లెపూల రసంతో కంటి చుట్టు భాగాల్లో మర్దన చేసుకొని పడుకుంటే చల్లగా ఉంటుంది.
*చుండ్రుతో బాధపడేవారు మల్లెపూల రసాన్ని మెంతులతో కలిపి తలకు పట్టించవచ్చు.
*చర్మానికి అవసరమయ్యే సి విటమిన్‌ మల్లెపూల పుష్కలంగా ఉంటుంది.
*మల్లెపూల రసాన్ని, గులాబీల రసంతో కలిపి.. ముఖానికి రాసుకంటే చర్మం మృదువుగా తయారవుతుంది.
*కొబ్బరినూనెతో కలిపి మల్లెపూల రసాన్ని తలకు రాసుకుంటే.. మంచి సువాసన వస్తుంది.
*సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాల్లో కూడా నేడు మల్లెపూలను వాడుతున్నారు.
*మల్లెపూలతో తయారు చేసే పలు ఔషధాలు కణితులను కూడా నివారిస్తాయని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి
*అరోమాథెరపీలో కూడా మల్లెపూలను వాడుతున్నారు.
*మొటిమల వల్ల వచ్చే మచ్చలకు మల్లెల నూనె రాస్తే ఫలితం ఉంటుంది.
*మల్లెల సువాసన నిద్రలేమిని కూడా దూరం చేస్తుందట.