ప్రతిరోజూ దొరికే అరటిపండుతో.. సరికొత్త ప్రయోజనాలు

ప్ర‌పంచంలోనే ఎక్కువ‌గా తినే పండు అరటిపండు. కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి, అలా ప్రతి రోజు దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు.
అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనిని పండుగా తినవచ్చు లేదా జ్యుస్ గా సలాడ్ లో కూడా తినవచ్చు. వెనుకటికి ఒక శాస్రం ఉండేది రోజు ఒక ఆపిల్ తింటే మనిషికి డాక్టర్ అవసరం రాడు అని. కానీ అరటి పండు తిన్న డాక్టర్ అవసరం లేదు అంటున్నారు డాక్టర్స్.

అర‌టి పండులో ఎక్కువ‌గా ఉండే పీచు ప‌దార్ధం ఆక‌లి వేయ‌కుండా చేస్తుంది. బరువును కంట్రోల్ చేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ప్ర‌తి రోజు అర‌టి పండు తినడం వ‌ల్ల త‌క్ష‌ణ శ‌క్తి పొంద‌వ‌చ్చు.

అరటి పండులో విటమిన్స్,మినరల్స్, ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకు రోజంతా ఎనర్జీని ఇస్తుంది.

మలబద్దకం ఎక్కువగా ఉన్నవారికి ఒక నెల రోజులు కచ్చితంగా తినిపిస్తే వారికి ఇక ఆ సమస్య ఉండదు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి అది మలబద్దకాన్ని నివారిస్తుంది.

హార్ట్ సమస్యలు, యాసిడిటి సమస్యలను అరటి తొందరగా అరికడుతుంది.

అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండటంవలన బ్లెడ్ ప్రెషర్ ని తగ్గిస్తుంది.

ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇందులో ఉండే ఐరన్, హిమోగ్లోబిన్ ని ఎక్కువ చేసి అనీమియాను రాకుండా చేస్తుంది.

అరటి పండ్లలో ఉండే విటమిన్ బి6 గర్భిణులకు మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, కడుపులో బిడ్డ ఎదుగుదలకు ఇలా అనేక ర‌కాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఇందులో ఎక్కువగా విటమిన్స్ ఉండటం వలన కంటి చూపుకు కూడా చాలా పనిచేస్తుంది.

ఈ పండు తినడం వలన జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ముఖ్యంగా ఎసిడిటిని ఎక్కువగా తగ్గిస్తుంది.

మచ్చలున్న అరటి పండులో క్యాన్సర్ తో పోరాడే కణాలు అధికంగా ఉంటాయి.