7 ఏళ్ళ బాలుడు – 7 కేజీల బరువు
Timeline

7 ఏళ్ళ బాలుడు – 7 కేజీల బరువు

దేశాల మధ్య యుద్దాలు, వాటి ప్రతి ఫలాలు. అవి కథల్లో సినిమాల్లో విని చూసి పెద్దగా పట్టించుకోము. కానీ అక్కడ ఇజంగా ఆ యుద్ధాల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల వ్యధలు, యుద్ధం ముగిసిన తరువాత అక్కడ ఏర్పడిన పరిస్థితుల మధ్య వారి జీవన విధానాల వలన వారు పడే కష్టాలు చూసి తట్టుకునే శక్తి మనకు ఉండదు. దానికి ఉదాహరణే ఈ వార్త కథనం లో ప్రచురించిన ఫోటో.

ఈ అబ్బాయి పేరు ఫెయిద్ సమీమ్. ఏడేళ్ల ఫెయిద్ సమీమ్ యెమెన్ రాజధాని సనాలోని హాస్పిటల్ బెడ్‌పై పడుకుని ఉన్న ఫోటోనే ఇది. సరైన ఆహారం లేక పోషకాహారం లేక ఈ స్థితిలో ఉన్నాడు సమీమ్. వారి ప్రాతంలో ఆసుపత్రి లేదు. ఆసుపత్రికి తనను తీసుకు రావడానికి అతని కుటుంబం సనాకు ఉత్తరాన 170 కి.మీ (105 మైళ్ళు) నుండి అల్-జావ్ఫ్ నుండి చెక్ పాయింట్లు మరియు దెబ్బతిన్న రోడ్ల ద్వారా ప్రయాణించవలసి వచ్చింది. ఫెయిడ్ యొక్క మందులు లేదా చికిత్సను భరించలేక, అతనికి చికిత్స పొందడానికి కుటుంబం విరాళాలపై ఆధారపడుతుంది.అతను ఆసుపత్రిలో చేరినపుడు తను బతికే ఛాన్స్ లేదనుకున్నారు అక్కడి వైద్యులు , వారు ఎంతో కృషి చేసి తన ప్రాణాలను కాపాడగలిగారు. ఆసుపత్రిలో మడిచిపెట్టిన దుప్పటి సగం తనపై కప్పడానికి సరిపోతుంది అని రాయిటర్స్ తన వార్త కథనంలో పేర్కొంది .

అక్కడ 6 సంవత్సరాలు యుద్ధం జరిగింది. 80 శాతం మందికి ఆహారం కూడా ఉండదు.

Leave a Reply

Your email address will not be published.